కృతజ్ఞతాంజలి

మొదటి నుండి భగవద్దర్శన్‌ తెలుగు మాసపత్రిక ముద్రణలో మాకు నిరంతరము స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి “The Bhaktivedanta Book Trust” నిర్వాహకులైనట్టి శ్రీమాన్‌ భీమాదాసుగారికి మా కృతజ్ఞతలు. సర్వదా మాకు సహాయసహకారాలు అందిస్తున్నటువంటి శ్రీమాన్‌ ఆనందతీర్థదాసుగారికి మా కృతజ్ఞతలు.


బ్యాక్‌ టు గాడ్‌హెడ్ (Back to Godhead) ఆధ్యాత్మిక పత్రిక 70 ఏళ్ళు పూర్తి చేసికొంటున్న సందర్భంగా మేము భగవద్దర్శన్‌ తెలుగు మాసపత్రికను e-పత్రికగా రూపొందించడానికి సంకల్పించగానే మనస్ఫూర్తిగా ఆమోదాన్ని తెలిపినటువంటి “BTG India” నిర్వాహకవర్గానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. యుధిష్ఠిర్‌దాస్‌ గారికి (పబ్లిషర్‌), పాండురంగదాస్‌ గారికి (జనరల్‌ మానేజర్‌), శ్యామానందదాస్‌ గారికి (సంపాదకులు) మరియు సుందరరూపదాస్‌ గారికి (డిజైన్‌) ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.


భగవద్దర్శన్‌ మాసపత్రికకు e-రూపాన్ని ఇవ్వాలని సంకల్పించగానే దానికి కావలసినటువంటి సంపూర్ణ సాంకేతిక సహకారాన్ని అతి స్వల్పకాలంలో అందజేసి సరిగ్గా బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌కి 70 ఏళ్ళు నిండిన రోజు నాడే ఆరంభించడానికి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి “M/s Gauranga Soft-Tech Private Ltd, Navi Mumbai, India” యాజమాన్యానికి మా కృతజ్ఞతలు. ముఖ్యంగా దీని డైరెక్టర్‌ శ్రీమాన్‌ రామగిరిధారిదాసు గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ఆశీస్సులు అందజేస్తున్నాము.


భగవద్దర్శన్‌ మాసపత్రికకు e-రూపాన్ని ఇవ్వడంలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను మనసా వాచా కర్మణా తోడ్పడిన ఎందరో వైష్ణవులు అందరికీ మా నమస్సుమాంజలులు.