మానవులకు పరమ శ్రేయస్సు


cover_page_octoberమనిషి ఎల్లప్పుడూ తన కష్టాలను తీర్చుకునే పనిలోనే మునిగిపోయి ఉంటాడు. కాని కష్టాలను తీర్చుకోవడానికి వెచ్చించే సమయంలో ఒక్క శాతాన్ని కష్టాలు ఎందుకు కలుగుతున్నాయనే విషయాన్ని చర్చించడానికి, ఆలోచించడానికి వినియోగిస్తే పూర్ణ సుఖభాగుడు, పూర్ణ శాంతివంతుడు అవడానికి అవకాశం ఉన్నది. మనిషికి అటువంటి ఆలోచనా దృక్పథాన్ని కలిగించేదే మీరిప్పుడు పట్టుకొన్నట్టి భగవద్దర్శన్‌ మాసపత్రిక. (more…)

భగవద్దర్శన్‌ ప్రయోజనమేమిటి?


Blog 1 photoఅసలు భగవద్దర్శన్‌ ప్రయోజనమేమిటి? ఎందుకు అది శ్రీల ప్రభుపాదులవారిచే ఆవిష్కరించబడింది? ఈ ప్రశ్నలకు సమాధానము శ్రీల ప్రభుపాదులచే మొదటి సంచికలోనే చెప్పబడింది. అంతే కాకుండ ఒక ప్రత్యేకమైన ఉత్తరంలో ఆయన ఆ విషయాన్ని భారత రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌కు వ్రాసారు. ఆ వివరాలేమిటో చూద్దాం!
మొదటి పేజీలో ”బ్యాక్‌ టు గాడ్‌హెడ్‌” పేరు క్రింద శ్రీల ప్రభుపాదులు ఈ పత్రిక యొక్క ప్రయోజనాన్ని ఈ విధంగా చెప్పారు. ”మనస్సుకు శిక్షణను ఇవ్వడానికి, మానవనైజాన్ని ఆత్మస్థితికి ఉద్ధరించడానికి సాధనము”. అంటే భగవద్దర్శన్‌ యొక్క ఏకైక ప్రయోజనము బద్ధజీవుని అసలైన శత్రువైనట్టి మనస్సుకు శిక్షణను ఇవ్వడం, ఆ విధంగా మానవనైజాన్ని ఆత్మస్థితికి ఉద్ధరించడం. (more…)

ధ్రువసందేశం


Krishna-Lifting-Govardhan”ధ్రువసందేశం” అనే మాటకు రెండు అర్థాలను చెప్పుకోవచ్చును. ఒకటి భక్తధ్రువుడు ఇచ్చిన సందేశం, రెండవది ”నిశ్చయమైన సందేశం”. మహానుభావులు చెప్పే మాటలన్నీ సందేశాలే అయి ఉంటాయి. అంతే కాదు, వారి చేతలు కూడ సందేశాన్ని ఇస్తాయి. ఐదేళ్ళ ప్రాయంలో ధ్రువుడు చేసిన కార్యమే కలకాలం భక్తులకు దివ్యసందేశంలాగా ఉండిపోయింది. ఆరునెలలలో తీవ్రమైన తపస్సు ద్వారా భగవద్దర్శనాన్నే పొందగలిగిన ధ్రువుని కార్యము అనితరసాధ్యమే అనిపిస్తుంది. అయినా దాని నుండి భక్తులు స్ఫూర్తిని పొందవచ్చును. మొదటి నెలలో కేవలము మూడు రోజులకు ఒకసారి అతడు పండ్లు తిని నామధ్యానంలో నిలిచాడు, రెండవ మాసంలో ఆరు రోజులకు ఒకసారి ఎండుటాకులను, గడ్డిని తిని నామసాధన చేసాడు, మూడవ మాసంలో తొమ్మదిరోజులకు ఒకసారి మంచినీళ్ళు త్రాగి నామజపం చేసాడు, నాలుగవ మాసంలో పన్నెండు రోజులకు ఒక్కసారి వాయువును భక్షించి నిలిచాడు, ఐదవ మాసంలో అతడు శ్వాసక్రియనే స్తంభింపజేసి చలనము లేకుండ ఒంటికాలిపై నిలిచి పరబ్రహ్మచింతనలో మునిగిపోయాడు. అటువంటి అద్భుతమైన తపస్సుకు ఆరవనెలలో అచ్యుతుడు ప్రత్యక్షమై ధ్రువుని కీర్తిని ఆచంద్రార్కము కావించాడు. తపస్సు ద్వారానే భగవద్దర్శనం సాధ్యమౌతుంది కాని తమస్సులో కాదని తన అకుంఠిత కార్యం ద్వారా ధ్రువుడు లోకానికి సందేశమిచ్చాడు. (more…)

నిత్య దీపావళి పండుగ


cover_page_octoberఅమావాస్య చీకట్లను తొలగించి వెలుగును నింపేది దీపావళి. అదే విధంగా చీకటి సంసారంలో ఆనందవెలుగులు నింపేది మన భగవద్దర్శన్‌ మాసపత్రిక. రాజు దర్శనాన్ని పొందిన తరువాత బంగారం అడిగితే బంగారం లభిస్తుంది, నూకలు అడిగితే నూకలు లభిస్తాయి. నేటికాలంలో అన్ని దేవస్థానాలు భక్తులతో క్రిక్కిరిసి ఉంటున్నాయి. అయితే భగవద్దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుని ప్రార్థించేది ఏమిటో శాస్త్రానుసారంగా, ప్రామాణిక పరంపరారూపంగా తెలిస్తే భక్తులు దివ్యలాభాన్ని పొందగలుగుతారు. (more…)

ప్రలంబఘ్న శ్రీబలదేవుడు


BalaramJayanti020వైశాఖమాసంలో ఒకరోజు దివ్యసోదరులైన బలరామకృష్ణులు మిత్రులతో కలిసి భాండీరవనంలో ఆడుకుంటున్నారు. లేతగడ్డిని తిని, గిరిగోవర్ధనుని పర్వతకోనలలో ఉన్నట్టి నిర్మలజలాన్ని త్రాగి ఆవులు చెట్ల క్రింద సేదదీరుతున్నాయి. గోపబాలురందరు మల్లికామాలలను ధరించియున్నారు. ఒక గోపబాలుడు తియ్యని గొంతుతో పాడడం మొదలుపెట్టాడు. (more…)

పండుగ సంబరాలు


Festivals”కలిమి గలవానికి ప్రతీరోజు పండుగే” అన్నది ఒక సామెత. బంధుమిత్రుల సమాగమముతో, పెద్దల ఆశీర్వచనాలతో, నోరూరించే విందులతో మనస్సును అలరించే వినోదముతో, కొంత భగవద్భక్తితో మానవుడు పండుగపూట సంబరము చేసికొంటాడు. సాధారణంగా మన వేదసంస్కృతిని బట్టి పండుగలన్నీ భగవత్సంబంధితమే అయియుంటాయి. అందువలన పూజలు వ్రతాలు మన పండుగ సంబరాలలో ముఖ్యకార్యక్రమము అవుతాయి. అంటే ఇతర రోజులలో సాంసారిక కలాపాలలో తలమునకలై ఉండే మానవులు కనీసము పండుగపూటైనా నిజమైన భగవత్సంబంధిత సంబరములో మునిగేటట్లు మన పండుగలు పెద్దలచే నిర్ణయించబడ్డాయి. (more…)

విశ్వాసం


krishna-gita1మనిషి సుఖాభిలాషి, ఆశాజీవి. ఎన్ని కష్టాలలో ఉన్నప్పటికిని తనకు ఏదో ఒక రోజు సుఖం లభిస్తుందనే విశ్వాసంతో ఉంటాడు. ఆ విశ్వాసమే అతడిని కార్యోన్ముఖుని చేస్తుంది. అసలు ఈ విశ్వాసమనేది ఏమిటి? ఏ విశ్వాసం నిజానికి మానవునికి అసలైన ఫలితాన్ని ఇస్తుంది? అటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఏ విధంగా సాధ్యపడుతుంది? ఇటువంటి ప్రశ్నలు జిజ్ఞాసువైన వ్యక్తికి తరచుగా కలుగుతుంటాయి. భర్త తనను చక్కగా చూసుకుంటాడని భార్య విశ్వసిస్తుంది, తాము ముసలివారైనపుడు సంతానం తమ బాగోగులు చూస్తారని తల్లిదండ్రులు విశ్వసిస్తారు, తాము నమ్ముకున్న గురువు తమను ఉద్ధరిస్తాడని సాధకులు విశ్వసిస్తారు, తాము చేసే పూజలు తమ కష్టాలను గట్టెక్కిస్తాయని ఆర్తులు విశ్వసిస్తారు. ఏ దేవతారూపాన్ని భజించినా ఒనగూడే చరమ ప్రయోజనము ఒక్కటేనని మాయావాదులు విశ్వసిస్తారు. ఈ విశ్వాసమనే పదాన్ని శ్రీచైతన్యులు సనాతనగోస్వామికి వివరిస్తూ అది ”శ్రద్ధ” అనేదాని నిర్వచనమని తెలిపారు. అంటే మనిషి ఒకానొక కార్యంలో విశ్వాసం చూపిస్తున్నాడంటే దానిలో శ్రద్ధను కలిగి ఉన్నాడని అర్థం. అయితే జగత్తులో నిజంగా విశ్వసించాల్సింది ఏమిటి? (more…)

నిత్యపఠనం


cover_page_juneసూర్యోదయంతో చీకట్లు తొలగిపోతాయి, అగచాట్లు తీరిపోతాయి. నిర్భయ చిత్తంలో వాంఛితకర్మలు ఆరంభమౌతాయి. అదేవిధంగా భగవద్దర్శన్‌ ఆధ్యాత్మిక పత్రిక మీ జీవితంలో ప్రవేశించడంతో అవిద్యాతిమిరము తొలగిపోతుంది, శోకమోహభయాలనే అగచాట్లు తీరిపోతాయి. ఆ విధంగా మీ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. నిర్మల చిత్తంతో మీరు గుర్వాన్వేషణలో సఫలీకృతులై ముక్తిమార్గంలో ప్రయాణిస్తారు. అంటే భగవద్దర్శన్‌ నిత్యపఠనం మానవజన్మలో జయకేతనాన్ని ఎగుర వేయడానికి దోహదపడుతుంది. (more…)

పరస్పర ఆకర్షణ


Radha-Krishna-Iskcon-HD-Photos-Wallpaper-Gallery-2రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వినిపిస్తాయి, రెండు మనస్సులు కలిస్తేనే ప్రేమ ఉదయిస్తుంది. పరస్పర ఆకర్షణకు మనం యువతీయువకుల ఉపమానాన్ని తీసికోవచ్చు. ఇది లౌకికమైన ఉదాహరణమేయైనా విషయం అర్థం కావడానికి బాగా తోడ్పడుతుంది. వారిద్దరి మధ్య పరస్పర ఆకర్షణ లేకపోతే ప్రేమ అనేది కలుగదు. ఏకపక్ష ఆకర్షణ కోపాలకు, తగాదాలకు, ఇంకా ఎన్నో కలతలకు దారి తీస్తుంది. ఇది కూడ మనకు యువతీయువకుల మధ్యనే బాగా కనిపిస్తుంది. ఇక పరస్పర ఆకర్షణ విషయాన్ని మన ఆధ్యాత్మిక రంగానికి అన్వయిస్తే కృష్ణుడు, కృష్ణభక్తుల నడుమ ఇది ఏ విధంగా పనిచేస్తుందో అర్ధమౌతుంది. అసలు వీరి మధ్య ఈ పరస్పర ఆకర్షణ ఏ విధంగా కలుగుతున్నదో, ఏ ఫలితాన్ని అది ఇస్తుంది, దాని శాశ్వతత్వమేమిటో తెలిసికోవడమనేది అత్యంత ముఖ్యమైన విషయం. (more…)

ముఖ్యమైన మూడో పని


cover_page_janఆధ్యాత్మిక సాధకులకు ఆచార్యులు మూడు పనులు చెప్పారు. అదే కృష్ణుని నామాన్ని ఉచ్చరించడము, కృష్ణుని భజించడము, కృష్ణుని గురించి ఉపదేశము చేయడం. త్రికరణశుద్ధిగా ఈ మూడు కార్యాలను చేసేవారికి ముల్లోకాలలో నివసించవలసిన అవసరం తొలగిపోతుంది. అంటే వారి నివాసం భగవద్ధామమే అవుతుంది. కృష్ణనామం జపించగలం, కృష్ణుని భజించగలము, కాని కృష్ణుని గురించి ఎలా చెప్పాలో మాకు రాదని మీరంటే మీతో ఆ పని చేయించడానికే ఈ భగవద్దర్శన్‌ ఉదయించిందని తెలిసికోండి. ఒక వ్యక్తికి మీరు ఈ భగవద్దర్శన్‌ పత్రికను ఇచ్చి, అతడు దీనిని చదివేటట్లు చేస్తే ముఖ్యమైన మూడో పని కూడ చేసినట్లే అవుతుంది. (more…)