నిత్యపఠనం

cover_page_juneసూర్యోదయంతో చీకట్లు తొలగిపోతాయి, అగచాట్లు తీరిపోతాయి. నిర్భయ చిత్తంలో వాంఛితకర్మలు ఆరంభమౌతాయి. అదేవిధంగా భగవద్దర్శన్‌ ఆధ్యాత్మిక పత్రిక మీ జీవితంలో ప్రవేశించడంతో అవిద్యాతిమిరము తొలగిపోతుంది, శోకమోహభయాలనే అగచాట్లు తీరిపోతాయి. ఆ విధంగా మీ జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. నిర్మల చిత్తంతో మీరు గుర్వాన్వేషణలో సఫలీకృతులై ముక్తిమార్గంలో ప్రయాణిస్తారు. అంటే భగవద్దర్శన్‌ నిత్యపఠనం మానవజన్మలో జయకేతనాన్ని ఎగుర వేయడానికి దోహదపడుతుంది. అందుకే భగవద్దర్శన్‌ పత్రికను చదవండి, చదివించండి. మీరు సుఖభాగులై పదుగురికి ఆ ఆనందాన్ని పంచండి. హరేకృష్ణ!

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.