
అసలు భగవద్దర్శన్ ప్రయోజనమేమిటి? ఎందుకు అది శ్రీల ప్రభుపాదులవారిచే ఆవిష్కరించబడింది? ఈ ప్రశ్నలకు సమాధానము శ్రీల ప్రభుపాదులచే మొదటి సంచికలోనే చెప్పబడింది. అంతే కాకుండ ఒక ప్రత్యేకమైన ఉత్తరంలో ఆయన ఆ విషయాన్ని భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌కు వ్రాసారు. ఆ వివరాలేమిటో చూద్దాం!
మొదటి పేజీలో ”బ్యాక్ టు గాడ్‌హెడ్” పేరు క్రింద శ్రీల ప్రభుపాదులు ఈ పత్రిక యొక్క ప్రయోజనాన్ని ఈ విధంగా చెప్పారు. ”మనస్సుకు శిక్షణను ఇవ్వడానికి, మానవనైజాన్ని ఆత్మస్థితికి ఉద్ధరించడానికి సాధనము”. అంటే భగవద్దర్శన్ యొక్క ఏకైక ప్రయోజనము బద్ధజీవుని అసలైన శత్రువైనట్టి మనస్సుకు శిక్షణను ఇవ్వడం, ఆ విధంగా మానవనైజాన్ని ఆత్మస్థితికి ఉద్ధరించడం.
(more…)