భక్తిరక్షకమైన శ్రీనృసింహదర్శనం


ఇతో నృసింహః పరతో నృసింహ యతో యతో యామి తతో నృసింహః |
బహిర్ నృసింహ హృదయే నృసింహ నృసింహమాదిం శరణం ప్రపద్యే ||

Narasimhayadagiriguta”శ్రీనృసింహుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడను ఉన్నాడు, నేనెక్కడకు వెళితే అక్కడను నృసింహుడు ఉన్నాడు. ఆ నృసింహుడు హృదయం లోపల, బయట కూడ ఉన్నాడు. సమస్తానికీ ఆదియైనవాడు, పరమాశ్రయమైనవాడు అయినట్టి శ్రీనృసింహునికి నేను శరణుజొచ్చెదను.”
భక్తిలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు వైష్ణవులు శ్రీనృసింహుని కొలుస్తారు, భక్తితో సేవిస్తారు, ఆనందంతో కీర్తిస్తారు. శ్రీనృసింహుడు భక్తప్రహ్లాదుని రక్షించిన విధము అత్యద్భుతము. పైన తెలుపబడిన స్తోత్రంలో లాగా తెలుగువారి పుణ్యఫలంగా శ్రీనృసింహుడు మన రాష్ట్రంలో అడుగడుగునా వెలసి ఉన్నాడు. భక్తులకు కోరిన కోరికలు తీరుస్తున్నాడు. ఆ విధంగా వెలసిన శ్రీనృసింహతీర్థాలలోని కొన్ని ముఖ్యమైనవాటిని ఇక్కడ మీరు సంక్షిప్తంగా తెలిసికోవచ్చును. (more…)

నిజమైన నేస్తం


cover_page_december”నేనెవరిని? నాకెందుకు త్రివిధ తాపాలు కలుగుతున్నాయి? ఈ విషయం నాకు తెలియకపోతే సుఖమెట్లా కలుగుతుంది?” అని శ్రీల సనాతనగోస్వామి శ్రీచైతన్యులను ప్రశ్నించారు. ఎదురయ్యే కష్టాలకు, దుఃఖాలకు పరిష్కారాలు ఆలోచించడముతోనే జీవితాలు గడిచిపోతున్నాయి. కాని ఎప్పుడైతే బుద్ధిమంతుడైన మనిషి ఈ సమస్యలకు పరిష్కారాలే కాకుండ వాటికి మూల కారణాన్ని కూడ కనుక్కోవడానికి యత్నిస్తాడో అతడే సాధకుడని పిలువబడతాడు. అటువంటి సాధకుని నేస్తమే ఈ భగవద్దర్శన్ ఆధ్యాత్మిక మాసపత్రిక. (more…)

నామాశ్రితునికి పాపప్రాయశ్చిత్తం అక్కరలేదు


హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే |
హరే రామ హరే రామ రామ రామ హరే హరే ||

Haridasa-Thakura1హరినామము శుద్ధసత్త్వగుణస్థితిలోనే సదా నిలిచి ఉంటుంది. కేవలము పరమ భాగ్యవంతులైన జీవులే హరినామాన్ని అనన్యంగా ఆశ్రయిస్తారు. హరినామోచ్చారణము సకల అనర్థాలను నివారిస్తుంది. తత్ఫలితంగా హృదయదౌర్బల్యం నశించిపోతుంది. హరినామము మీద అకుంఠితమైన శ్రద్ధ కలిగినపుడు పాపప్రవృత్తి పూర్తిగా తొలగిపోతుంది. అపుడు పూర్వ పాపాలన్నీ నశించిపోతాయి. హృదయం అపుడు పవిత్రతతో నిండిపోతుంది. హృదయంలోని పాపవాంఛల మూలము అజ్ఞానంలోనే ఉంటుంది. పాపము, పాపబీజము, అజ్ఞానము అనే మూడు అంశాలే బద్ధజీవుని దుఃఖానికి కారణాలు. (more…)

అసలైన నటులు


cover_page_marchఅసలైన నటులెవరో తెలిసికొనే ముందు అసలు నటన అంటే ఏమిటో తెలిసికోవడం మంచిది. తన స్వభావానికి, స్థితికి విరుద్ధంగా ఎవరైనా వర్తిస్తే అది నటన అవుతుంది. చీమకైనా అపకారం చేయనట్టి వ్యక్తి రంగస్థలం పైన లేదా వెండితెర పైన గొంతులు కోసే వ్యక్తిగా కనిపిస్తే అది నటన అవుతుంది. అదేవిధంగా కోటీశ్వరుడు కటిక బీదవానిగా నటించడము, మహాభయస్థుడు పదిమంది రౌడీలను ఒకేసారి చావగొట్టే హీరోగా నటించడము వంటివి ఇంకొన్ని ఉపమానాలు అవుతాయి. సినీనటులకు జనులు బ్రహ్మరథం పట్టడం కొత్తేమీ కాదు. అది ఏనాటి నుండో వస్తున్నది. కాని జనులు అసలైన నటులు తామేనని తెలిసికోలేకపోతున్నారు. వెండి తెరపై కనిపించే నటుడు చెప్పే మాటలు అతనివి కావు, భంగిమలు అతనివి కావు, పాటలు అతనివి కావు, భావప్రకటన అతనిది కాదు. అయినా అతనినే జనులు మహానటుడని ఆకాశానికి ఎత్తుతారు. (more…)

ఇంటింటా గౌరనితాయి!


Gaura Nitaiప్రతీజీవుడు సుఖాన్నే కోరుకుంటాడు; దుఃఖాన్ని ఎవ్వడూ కోరుకోడు. అయితే సుఖం కలగాలంటే శాంతి అవసరమౌతుందనే విషయం మాత్రం అత్యధికశాతం జనులకు తెలియదు. అంటే సుఖాన్ని వాంఛించేవాడు శాంతిని పొందడానికి ప్రయత్నించాలే గాని ఏవో వస్తువుల ద్వారా సుఖాన్ని పొందగలుగుతాననే భ్రాంతిని విడిచిపెట్టాలి. నిజంగా సుఖము ఆ విధంగా బజారులో కొనుక్కునేదే అయితే ఈ జగత్తు దుఃఖాలయం ఎట్లా అవుతుంది? సత్త్వగుణము ద్వారా శాంతి, శాంతి ద్వారా సుఖము, సుఖము ద్వారా ఆనందమనే క్రమంలోనే మనిషి ఆనందభాగుడు కాగలడు గాని అన్యథా కాదు. కాని ప్రస్తుత కలియుగములో సత్త్వగుణము సాధ్యమేనా? ఇది నిజంగా గంభీరమైన ప్రశ్న. కలియుగము దోషనిధి, కేవలము తమోగుణంతోనే నిండి ఉండేది. కలియుగంలో స్థానము, ద్రవ్యము, వ్యక్తి అందరు అపవిత్రస్థితిలోనే ఉండడం ముఖ్యంగా తెలిసికోవలసిన విషయము. ఇటువంటి పరిస్థితిలో యుగధర్మమైన హరినామసంకీర్తన ద్వారా పునీతులమై హృదయంలో కేశవుని నిలుపుకోవడమే సత్త్వగుణస్థితిని పొందడానికి ఏకైక మార్గము. (more…)

రామభక్తుల రామపరాయణత్వము


Ram navami 1హనుమదాది రామభక్తులు రామనామ మహిమను చక్కగా లోకంలో చాటారు. ఆంజనేయుడు సీతాన్వేషణ కార్యంలో లంకకు చేరవలసివచ్చినపుడు రామనామంతోనే సముద్రాన్ని లంఘించాడు. ఇక శ్రీరాముడు వానరసేనతో లంకపై దాడి చేయడానికి వెడలినపుడు సముద్రంపై వారధి కట్టవలసివచ్చింది. అపుడు రాళ్ళపై రామనామాన్ని వ్రాసి అవి నీటిపై తేలేటట్లు చేయడం జరిగింది. ఆ విధంగా కొండశిలలు కూడ రామనామంతో తేలికపడి నీటిపై తేలాయి. సేతుబంధనంలో తమ వంతు కార్యాన్ని నిర్వహించాయి. ఆ కాలంలోనే కాకుండ ప్రస్తుత కాలంలోను తులసీదాసు, భద్రాచల రామదాసు, త్యాగయ్య వంటి ఎందరో రామభక్తులు తమ భక్తితత్పరతతో తరించారు. శ్రీచైతన్యమహాప్రభువు దక్షిణభారతదేశంలో ఉన్నప్పుడు అటువంటి ఒక రామభక్తుని కలిసికోవడం జరిగింది. (more…)

మా ఊరు


Blog 24”మా ఊరు” అనే మాట పలుకని వారుండరు. ఉన్న ఊళ్ళో ఉండేవారైనా, పొరుగూరికి వెళ్ళినవారైనా, విదేశాలకు వెళ్ళినవారైనా ఈ మాటను ఏదో ఒక సందర్భములో అంటూనే ఉంటారు. అయితే ఈ విషయం ఏదో ఒక ప్రత్యేకమైన దేశానికి, ప్రాంతానికి చెందిన అలవాటు కాదు. ఇది మనిషి తత్త్వం, మనిషి నైజం. ప్రవాసంలో ఉన్న వ్యక్తికి తన ఊరికి వెళ్ళే బస్సును చూస్తే, రైలును చూస్తే ఆనందం కలుగుతుంది. తానెప్పుడు ఆ విధముగా ప్రయాణిస్తానా యని అతడు కలలు కంటాడు. ఎవరైనా తెలిసినవాళ్ళు కలిస్తే తన ఊరు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. ఇది మనందరి అనుభవము లోనిదే. అందుకే ”ఉన్న ఊరు, కన్నతల్లి” అనే మాటలు సర్వసాధారణమయ్యాయి. (more…)

మానవులకు పరమ శ్రేయస్సు


cover_page_octoberమనిషి ఎల్లప్పుడూ తన కష్టాలను తీర్చుకునే పనిలోనే మునిగిపోయి ఉంటాడు. కాని కష్టాలను తీర్చుకోవడానికి వెచ్చించే సమయంలో ఒక్క శాతాన్ని కష్టాలు ఎందుకు కలుగుతున్నాయనే విషయాన్ని చర్చించడానికి, ఆలోచించడానికి వినియోగిస్తే పూర్ణ సుఖభాగుడు, పూర్ణ శాంతివంతుడు అవడానికి అవకాశం ఉన్నది. (more…)

భగవద్దర్శన్ నిత్యపాఠకులు కండి


B-Eye 1పాఠకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సూర్యుడు వెలుగునిస్తాడు, చంద్రుడు వెన్నెలను కురిపిస్తాడు. మనకు సూర్యుడి వెలుగు కావాలి, చంద్రుని వెన్నెల కూడ కావాలి. కాని ఈ రెండు కూడ ఒకేసారి కావాలంటే కుదరదు. రెండింటి కోసం విడివిడిగానే మనం వేచి ఉండాలి. భాగవతము సూర్యుడు వంటిదని చెప్పబడింది. హరినామ సంకీర్తనము శ్రేయస్సనే వెన్నెలను కురిపిస్తుందని చెప్పబడింది. ఇప్పుడు మీరు పట్టుకున్న భగవద్దర్శన్లో భాగవతం ఉన్నది, హరినామసంకీర్తనను గురించి తెలిపే కథనాలు కూడ ఉన్నాయి. అంటే మీరు భగవద్దర్శన్ పత్రికను చదువుతున్నారంటే ఒకే సమయంలో సూర్యుని వెలుగును, చంద్రుని వెన్నెలను అనుభవిస్తున్నట్లే అవుతుంది. (more…)

నూతన సంవత్సరానికి ఆధ్యాత్మికలక్ష్యాలు


cover_page_decemberపాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రతీ యత్నానికీ ఒక లక్ష్యం ఉంటుంది. అయితే ఆ లక్ష్యం హెచ్చుతగ్గు స్థాయిలకు చెంది ఉండవచ్చును. హెచ్చుస్థాయి లక్ష్యం అధిక పరిమాణంలో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తే తగ్గుస్థాయి లక్ష్యం తదనుగుణమైన ఫలాన్నే కలుగజేస్తుంది. భక్తియోగమనేది భౌతికజగత్తులో మానవుడు చేయగలిగే సర్వోత్తమమైన కార్యం. దాని లక్ష్యం భగవత్ప్రీతి. ఈ దివ్యమైన లక్ష్యంతో ఈ జగత్తులోని ఏ కార్యలక్ష్యము సరిపోలదు. అందుకే మన ఆచార్యులు తాము చేసే భక్తియుతసేవలో మహోన్నతమైన లక్ష్యాలు పెట్టుకొని మనకు మార్గదర్శనం చేసారు. నామాచార్య శ్రీల హరిదాసఠాకూరులు రోజుకు మూడు లక్షల హరినామాన్ని జపించే లక్ష్యం పెట్టుకున్నారు, శ్రీల సనాతనగోస్వామి ప్రతీరోజు గిరిరాజు గోవర్ధనునికి ప్రదక్షిణం చేసే లక్ష్యం పెట్టుకున్నారు, శ్రీల ప్రభుపాదులవారి గురుదేవులైన శ్రీ శ్రీమద్ భక్తిసిద్ధాంతసరస్వతీ ఠాకూరులు వందకోట్ల హరినామం జపించే మహోన్నత లక్ష్యం పెట్టుకున్నారు. (more…)