గీతాజయంతి


Gita Jayanti_1పాఠకులందరికీ గీతాజయంతి మాస శుభాకాంక్షలు! మానవులకు పరమ ధర్మాన్ని బోధించిన శాస్త్రమే గీతాశాస్త్రము. అటువంటి భగవద్గీత ఉదయించిన మాసమే ఈ నెల. అందుకే భక్తులందరు ఈ నెలలో తమ శక్త్యనుసారము ”భగవద్గీత యథాతథము” గ్రంథాలను వితరణ చేయడానికి యత్నిస్తారు. ఎవడైతే గీతాజ్ఞానాన్ని తన భక్తులకు పంచుతున్నాడో అతడే తనకు ప్రియతముడని శ్రీకృష్ణభగవానుడు భగవద్గీత చివరలో తెలిపాడు. (more…)

గీతోదయం


BGఇది గీతాజయంతి మాసము. బద్ధజీవులను సంసారబంధనం నుండి విడుదల చేసి, స్వరూపస్థితిని కలుగజేసి నిజస్థితిలో నెలకొనేటట్లు చేయడానికి శ్రీకృష్ణభగవానుడు కొన్ని కోట్ల సంవత్సరాల క్రిందటే గీతాజ్ఞానాన్ని సూర్యదేవునికి చెప్పాడన్నది చారిత్రిక సత్యం. అయితే కాలక్రమంలో ఈ గీతాజ్ఞానం నష్టమైనట్లు గోచరించడం వలన ఆ దేవదేవుడు అర్జునుని నిమిత్తంగా చేసికొని తిరిగి మానవులకు జ్ఞానోపదేశం చేసాడు. అటువంటి దివ్యకార్యం జరిగిన సందర్భమే ఈ గీతాజయంతి మాసం. సూర్యోదయంతో జగత్తులో వెలుగు నిండుతుంది, కాని ఇంట్లో తలుపులన్నీ మూసుకొని కూర్చొనిన వ్యక్తికి ఆ వెలుగు అందదు. అతడు చీకటిలోనే ఉండిపోతాడు. వెలుగు కావాలంటే అతడు కిటికీలు, తలుపులు తెరవక తప్పదు. ఇక సూర్యకాంతి యొక్క పూర్ణలాభాన్ని పొందాలంటే అతడు ఇంట్లో నుండి సూర్యకాంతిలోకి రావాలి. (more…)

మిగిలిన టైమెంత?


భగవద్గీతను చదివి జీవితంలో మార్గదర్శనం పొందండని భక్తుడు సలహా ఇవ్వగానే ”గీతాభాగవతాలు చదవడానికి ఇంకా చాలా టైముంది. ఇప్పుడే అవి చదవనక్కరలేదు” అని లౌకికుడు ఠక్కున సమాధానం ఇస్తాడు. ఇక పొరబాటున ఎవరైనా చిన్నప్పుడే భగవద్గీత మీద అభిరుచిని చూపిస్తే ”ఇప్పటి నుండే భగవద్గీత ఏమిటి? పెద్దయ్యాక చూసుకోవచ్చు” అని వెంటనే అతని మీద విసుక్కుంటారు. కాని నిజంగా విశ్లేషణ చేస్తే మన జీవితంలో మిగిలిన టైమెంత? చాలా ఉన్నట్లే అనిపిస్తుంది, కాని పరీక్షగా చూస్తే చాలా చాలా తక్కువ. అదేమిటో చూద్దాం!KC Pie
ఉదాహరణకు మనిషి వందేళ్ళు జీవిస్తే అందులో ముపై#్ప మూడేళ్ళు నిద్రలోనే గడిచిపోతుంది. (more…)

మీ నిజమైన ఆప్తుడు


cover_page_octoberవేదసారస్వత రహస్యాలను ఊరూరా తెలియజేయడమే ఈ భగవద్దర్శన్ మాసపత్రిక లక్ష్యము. ఉదాహరణకు వేదవాఙ్మయము ఈ విధంగా ఉదహరించింది : ”మనిషి సూర్యగ్రహణ సమయంలో కోటి గోవులను దానమిచ్చినా, గంగా యమున సంగమ స్థానంలో వేలకొలది సంవత్సరాలు వసించినా లేదా బ్రాహ్మణులకు మేరుపర్వతమంత బంగారాన్ని దానమిచ్చినా గోవింద నామకీర్తన ఫలంలో నూరవవంతైనా సాధించలేడు.” (more…)

ఒక్క కృష్ణుడే


Krishna2”ఒక్క కృష్ణుడే” అంటే కృష్ణుడు తప్ప ఇంకొక విషయం లేదని అర్థం. జగత్తులో మన కలాపాలు మనస్సు ద్వారా, వాక్కుల ద్వారా, శరీరము ద్వారా జరుగుతూ ఉంటాయి. అయితే త్రికరణాల ద్వారా జరిగే కలాపాల ముఖ్య ప్రయోజనము ”ఒక్క నేనే” అయి ఉంటుంది. అంటే అన్ని కార్యాలు మనము కేవలము మన కొరకే చేస్తాము. ”మనము” అనగానే అందులో మన దేహము, కుటుంబసభ్యులు, బంధువులు వంటి విషయాలన్నీ వస్తాయి. దీనినే శాస్త్రాలు ”నేను, నాది” అనే మనస్తత్త్వం అని అంటాయి. భగవద్భక్తుల సాంగత్యం కలిగినపుడు మనిషి తన జీవితంలోకి శ్రీకృష్ణుని తీసికొని వస్తాడు. అంటే తన గురించి ఆలోచించడం, పనిచేయడంతో పాటు కాస్త కృష్ణుని గురించి కూడ ఆలోచించడం మొదలుపెడతాడు. ఈ స్థితిని మనం ”నేను మరియు కృష్ణుడు కూడా” అని చెప్పుకోవచ్చును. (more…)

అంకుశం


Ankush 2మనిషితో పోలిస్తే ఏనుగు దేహం ఎంతో పెద్దది; దాని బలం కూడా ఎంతో గొప్పది; దాని ఆహారం మోతాదు కూడ ఎంతో పెద్దది. వీటిల్లో మనిషి ఏనుగు ముందు ఏమాత్రం సరిపోలడు. అయినా మనిషి దగ్గర ఏనుగును లొంగదీసుకొని తనకు కావలసిన పనులు చేయించుకునే సాధనం ఉన్నది. అదే అంకుశం. ఎంతటి బలవత్తరమైన ఏనుగైనా అంకుశం పోటుతో నెమ్మదిస్తుంది. (more…)

సత్యదర్శనం


BDS”అమ్మో! పాము” అని గొంతులో నుండి భయంతో ఆర్తనాదం కదిలింది. కాని ఇంతలోనే పాముపై టార్చిలైటు వెలుగు పడింది. ”ఓస్! తాడేనా” అనే ప్రశాంతముతో కూడిన వాక్కు నోటి నుండి అప్రయత్నంగా వచ్చింది. ”ఈ జగత్తు నా భోగానికి ఉన్నది” అనే భావనమే సర్పభ్రాంతి. అప్పుడు కలిగేది సంసారభయం. అయితే మీకు జగత్తు గురించి సత్యదర్శనం చేయించే చేతి టార్చిలైటే ఈ భగవద్దర్శన్ ఆధ్యాత్మిక మాసపత్రిక. (more…)

సుముఖులై సుఖభాగులు కండి!


BGఎవరైనా చెప్పేమాట నచ్చనపుడు మనము ముఖము ప్రక్కకు తిప్పుకుంటాము. అంటే వారు చెప్పేవాటికి విముఖులమయ్యామని మన చేష్ట ద్వారా మనము చూపిస్తాము. ఇక వారు చెప్పేది నచ్చితే వారి ముఖంలోకే కళ్ళార్పకుండా నవ్వుతూ చూస్తాము. అంటే వారికి మనము సుముఖులుగా ఉన్నామని ఆ చేష్ట ద్వారా మనము చూపిస్తాము. ఈ విధంగా మనము ఒకరి పట్ల సుముఖులము, ఇంకొకరి పట్ల విముఖులము కావడము సర్వసాధారణమే. అయితే వీటి వల్ల మన జీవితాలలో ఏదో పెనుమార్పులు సంభవించవు. కాని మనము కృష్ణుడు చెప్పే మాటల పట్ల విముఖులమైతే ఘోరమైన దుఃఖాలు అనుభవించవలసి ఉంటుంది; సుముఖులమైతే ఆనందమయ జీవితము వైపు పురోగమించడము జరుగుతుంది. జనులు సాధారణంగా కృష్ణవిముఖులై ఉంటారని ”జనస్య కృష్ణాత్ విముఖస్య దైవాత్” అని భాగవతం చెప్పింది. తత్కారణముగా వారు అధర్మశీలురౌతారు, దాని వలన వారు అతిదుఃఖభాగుల కోవకు చేరిపోతారు. (more…)

శ్రీకృష్ణుని చేతిలో మణిమాల


Krisha with cows 3కృష్ణబలరాములకు పౌగండవయస్సు (ఆరు నుండి పదిసంవత్సరాల లోపు) రాగానే నందాది వ్రజపెద్దలు వారికి గోపాల కార్యాన్ని అప్పగించారు. అప్పటి దాకా గోవత్సాలను మేపుతూ గోవత్స పాలకుడని పేరుపొందిన అచ్యుతుడు ఆ తరువాత గోవులను మేపి గోపాలుడయ్యాడు. పద్మపురాణంలోని కార్తీకమాహాత్మ్యము భాగంలో ఈ విషయం ఈ విధంగా చెప్పబడింది : (more…)

శ్రీల ప్రభుపాదవాణి


అనేకానేక జన్మల తరువాతే భగవచ్చరణాగతిSP Speaking
శిష్యుడు : ఈ భౌతికజగత్తులో దుఃఖాన్ని అనుభవించిన తరువాత ముక్తి అనేది మధురంగా ఉంటుంది కదా!
శ్రీల ప్రభుపాదులు : కాని ఈ దుఃఖమెందుకుంది? నీవు భగవంతుడివే అయితే నీకు ఈ దుఃఖమేమిటి? ”దుఃఖమనేది నా లీల” అనడం మూర్ఖత్వం కాదా? (more…)