ధ్రువసందేశం


Krishna-Lifting-Govardhan”ధ్రువసందేశం” అనే మాటకు రెండు అర్థాలను చెప్పుకోవచ్చును. ఒకటి భక్తధ్రువుడు ఇచ్చిన సందేశం, రెండవది ”నిశ్చయమైన సందేశం”. మహానుభావులు చెప్పే మాటలన్నీ సందేశాలే అయి ఉంటాయి. అంతే కాదు, వారి చేతలు కూడ సందేశాన్ని ఇస్తాయి. ఐదేళ్ళ ప్రాయంలో ధ్రువుడు చేసిన కార్యమే కలకాలం భక్తులకు దివ్యసందేశంలాగా ఉండిపోయింది. ఆరునెలలలో తీవ్రమైన తపస్సు ద్వారా భగవద్దర్శనాన్నే పొందగలిగిన ధ్రువుని కార్యము అనితరసాధ్యమే అనిపిస్తుంది. అయినా దాని నుండి భక్తులు స్ఫూర్తిని పొందవచ్చును. మొదటి నెలలో కేవలము మూడు రోజులకు ఒకసారి అతడు పండ్లు తిని నామధ్యానంలో నిలిచాడు, రెండవ మాసంలో ఆరు రోజులకు ఒకసారి ఎండుటాకులను, గడ్డిని తిని నామసాధన చేసాడు, మూడవ మాసంలో తొమ్మదిరోజులకు ఒకసారి మంచినీళ్ళు త్రాగి నామజపం చేసాడు, నాలుగవ మాసంలో పన్నెండు రోజులకు ఒక్కసారి వాయువును భక్షించి నిలిచాడు, ఐదవ మాసంలో అతడు శ్వాసక్రియనే స్తంభింపజేసి చలనము లేకుండ ఒంటికాలిపై నిలిచి పరబ్రహ్మచింతనలో మునిగిపోయాడు. అటువంటి అద్భుతమైన తపస్సుకు ఆరవనెలలో అచ్యుతుడు ప్రత్యక్షమై ధ్రువుని కీర్తిని ఆచంద్రార్కము కావించాడు. తపస్సు ద్వారానే భగవద్దర్శనం సాధ్యమౌతుంది కాని తమస్సులో కాదని తన అకుంఠిత కార్యం ద్వారా ధ్రువుడు లోకానికి సందేశమిచ్చాడు. (more…)

నిత్య దీపావళి పండుగ


cover_page_octoberఅమావాస్య చీకట్లను తొలగించి వెలుగును నింపేది దీపావళి. అదే విధంగా చీకటి సంసారంలో ఆనందవెలుగులు నింపేది మన భగవద్దర్శన్‌ మాసపత్రిక. రాజు దర్శనాన్ని పొందిన తరువాత బంగారం అడిగితే బంగారం లభిస్తుంది, నూకలు అడిగితే నూకలు లభిస్తాయి. నేటికాలంలో అన్ని దేవస్థానాలు భక్తులతో క్రిక్కిరిసి ఉంటున్నాయి. అయితే భగవద్దర్శనం చేసుకున్నప్పుడు భగవంతుని ప్రార్థించేది ఏమిటో శాస్త్రానుసారంగా, ప్రామాణిక పరంపరారూపంగా తెలిస్తే భక్తులు దివ్యలాభాన్ని పొందగలుగుతారు. (more…)