పరస్పర ఆకర్షణ

Radha-Krishna-Iskcon-HD-Photos-Wallpaper-Gallery-2రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వినిపిస్తాయి, రెండు మనస్సులు కలిస్తేనే ప్రేమ ఉదయిస్తుంది. పరస్పర ఆకర్షణకు మనం యువతీయువకుల ఉపమానాన్ని తీసికోవచ్చు. ఇది లౌకికమైన ఉదాహరణమేయైనా విషయం అర్థం కావడానికి బాగా తోడ్పడుతుంది. వారిద్దరి మధ్య పరస్పర ఆకర్షణ లేకపోతే ప్రేమ అనేది కలుగదు. ఏకపక్ష ఆకర్షణ కోపాలకు, తగాదాలకు, ఇంకా ఎన్నో కలతలకు దారి తీస్తుంది. ఇది కూడ మనకు యువతీయువకుల మధ్యనే బాగా కనిపిస్తుంది. ఇక పరస్పర ఆకర్షణ విషయాన్ని మన ఆధ్యాత్మిక రంగానికి అన్వయిస్తే కృష్ణుడు, కృష్ణభక్తుల నడుమ ఇది ఏ విధంగా పనిచేస్తుందో అర్ధమౌతుంది. అసలు వీరి మధ్య ఈ పరస్పర ఆకర్షణ ఏ విధంగా కలుగుతున్నదో, ఏ ఫలితాన్ని అది ఇస్తుంది, దాని శాశ్వతత్వమేమిటో తెలిసికోవడమనేది అత్యంత ముఖ్యమైన విషయం.
స్థూలసూక్ష్మదేహబుద్ధిని విడిచిపెట్టి, సర్వసంగ పరిత్యాగులై కేవలం ఆత్మలో రమించే ఆత్మారాములైనా కృష్ణుని లీలల పట్ల, గుణాల పట్ల ఆకర్షితులౌతారని భాగవతంలో చెప్పబడింది. అంటే శ్రీకృష్ణుడు తన లీలలు, దివ్యగుణాల ద్వారా విశుద్ధచిత్తము కలవారిని ఆకర్షిస్తాడు. కాని ప్రేమ ఉదయించడానికి ఏకపక్ష ఆకర్షణ సరిపోదు. మరి శ్రీకృష్ణుని ఆకర్షించే అంశము భక్తునిలో ఏముంటుంది? సాక్షాత్తుగా ఆ దేవదేవుడే భక్తునికి ఆధీనునిగా అయ్యే కారణం ఏమిటి? భక్తుడు పూర్తిగా భౌతికవాంఛారహితుడై ఉండి కేవలము కృష్ణసేవనే కోరుకుంటే అది కృష్ణునికి ఆకర్షణీయమైన అంశమౌతుంది. భౌతికవాంఛ అనగానే అది తన గురించే కావచ్చు, తన వారి గురించే కావచ్చు, తన రాబోయే జన్మల గురించే కావచ్చు, తన ప్రాణం గురించే కావచ్చు. కృష్ణసేవ కొరకు విశుద్ధ భక్తులు వీటన్నింటిని గడ్డిపోచలాగా చూస్తారు. ఎందుకంటే కృష్ణభక్తి ఫలం జ్ఞానవైరాగ్యాలు. ఈ జ్ఞానవైరాగ్యాలు భక్తునిలో కొద్దిగా కనబడినపుడు కృష్ణుడు అతని పట్ల ఆకర్షితుడౌతాడు. కృష్ణుడే ఆకర్షితుడు కావడంతో భక్తునిలో జ్ఞానవైరాగ్యాలు మరింతగా పెరిగిపోతాయి. భక్తుడు తన హృదయంలో ఎంత నిర్మలంగా అయితే, ఎంత తేలికగా అయితే అంత స్థిరంగా శ్రీకృష్ణుడు అక్కడ నివాసం చేస్తాడు. శ్రీమద్భాగవత వచనాలలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు అపుడు భక్తుని హృదయంలో బందీయే అవుతాడు. ఈ విధంగా కృష్ణుడు, కృష్ణభక్తుని నడుమ పరస్పర ఆకర్షణ మహోన్నత స్థాయికి చేరుతుంది. అపుడు భక్తుని హృదయంలో భగవంతుడు ఉంటాడు, భగవంతుని హృదయంలో భక్తుడు స్థిరంగా నిలిచిపోతాడు. ”నా భక్తులకు నేను తప్ప ఇంకొకటి తెలియదు, నాకు వారు తప్ప ఇంకొకరు తెలియదు” అని సాక్షాత్తుగా భగవంతుడే పలికే స్థితి అపుడు ఏర్పడుతుంది.
యువతీయువకుల నడుమ కలిగే పరస్పర ఆకర్షణ తాత్కాలికమైనది, దాని పర్యవసానం శోకమోహాలే. కాని కృష్ణుడు, కృష్ణభక్తుల నడుమ ఒనగూడే పరస్పర ఆకర్షణ శాశ్వతమైనది, జన్మజన్మలకూ తొలగనిది, సచ్చిదానందమయ

H.G. Vaishnavanghri Sevaka Das

H.G. Vaishnavanghri Sevaka Das is Ph.D. in Polymer science, working as technology specialist in Polymer industry at Mumbai. He is actively serving BBT in translating Srila Prabhupada books into Telugu.