భగవద్దర్శన్ గురించి శ్రీల ప్రభుపాదుల ఉపదేశాలు

sp_group1(భగవద్దర్శన్ పత్రిక గురించి శ్రీల ప్రభుపాదులు తమ శిష్యులకు ఉత్తరాల రూపంలో ఎన్నో సూచనలు అందజేసారు, ఉపదేశాలు చేసారు. వాటిలో కొన్ని ఈ క్రింద పొందుపరుపబడినాయి.)sp_group2
  • “బ్యాక్ టు గాడ్‌హెడ్” (భగవద్దర్శన్)లో కథావిషయం చాలా గంభీరమైనది. దానిని చవుకబారు సాహిత్యములాగా తయారు చేయకూడదు. ప్రతియొక్కరు కృష్ణుడంటే ఎవరో తెలిసికొనే విధంగా అది ఉండాలి. కాబట్టి దానిని తాత్త్వికంగా, కాని సరళభాషలో చెప్పండి. రెండవ ముఖ్యమైన విషయం మనకు కృష్ణునితో ఉన్నట్టి సంబంధము, కృష్ణభక్తిభావనలో మన లక్ష్యాన్ని ఏ విధంగా సాధించాలో కూడ దానిలో చెప్పాలి. ఈ విషయాలన్నీ జనసామాన్యము అర్థం చేసికొనేలాగా చేయాలి. కాని రచనలో మాత్రం మనం చాలా గంభీరంగా ఉండాలి.”
  • “బ్యాక్ టు గాడ్‌హెడ్” (భగవద్దర్శన్) ప్రతులను చాలా సంఖ్యలో మనం పంచాలి. మీరు ఎంత ఎక్కువగా దీనిని ముద్రించి వితరణ చేస్తే అంత ఎక్కువగా మా గురుమహారాజుగారు చూసి ఆనందించి తమ కలలు సాకారమైనాయని భావిస్తారు.
  • “మీరు అంతటి మారుమూల ప్రాంతంలో బ్యాక్ టు గాడ్‌హెడ్(భగవద్దర్శన్) పత్రిక వితరణను వృద్ధి చేస్తున్నారని తెలిసి నేనెంతో ఆనందించాను. మన బ్యాక్ టు గాడ్‌హెడ్ పత్రిక మన ఉద్యమానికి వెన్నెముక వంటిది. అందుకే ఏ విధంగా దీనిని పెంచాలి, ఏ విధంగా దీనిని పెంచాలి, ఏ విధంగా దీనిని పెంచాలనే ఎప్పుడూ ఆలోచించాలి.”
  • “బ్యాక్ టు గాడ్‌హెడ్” (భగవద్దర్శన్) నా ప్రాణం. అందుకే దయచేసి ఎన్ని వీలైతే అన్ని ప్రతులు వితరణ చేయండి. దానిని నేను నా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ప్రారంభించాను. ఆ సమయంలో నేను 300-400 రూపాయలు దాని కొరకు ఖర్చు చేసేవాడిని; దాని నుండి ఎంత రాబడి వస్తున్నదని నేను చూడలేదు. ఈ పత్రిక అమెరికా పద్ధతిలో రీడర్స్ డైజెస్ట్, లైఫ్ పత్రికల లాగా లక్షలలో ముద్రించబడి ప్రపంచమంతట వితరణ కావాలనేది నా కోరిక.
  • “బ్యాక్ టు గాడ్‌హెడ్ పత్రికను అమ్మడంలో నీవు ఉత్సాహం చూపిస్తున్నావని తెలిసి ఆనందిస్తున్నాను. బ్యాక్ టు గాడ్‌హెడ్ పత్రికను అమ్మడమనేది చాలా విలువైనదిగా నేను భావిస్తాను. ఎందుకంటే మొదట్లో నేను భారతదేశంలో ఒంటరిగా దాని కొరకు రేయింబవళ్ళు కష్టపడ్డాను. ఈ బ్యాక్ టు గాడ్‌హెడ్‌ను నడపడానికి అపుడు నేనెంత కష్టపడ్డానో ఇప్పటికీ నాకు గుర్తుంది…. కాబట్టి బ్యాక్ టు గాడ్‌హెడ్ పత్రికను వందలు వేలు కాదు. లక్షలలో ముద్రించినపుడే నాకు గొప్ప ఉపశమనం కలుగుతుంది.”
  • “ఈ బ్యాక్ టు గాడ్‌హెడ్ (భగవద్దర్శన్) పత్రిక ఎప్పటికీ మన సంఘానికి వెన్నెముక లాగానే నిలబడి ఉంటుంది. ఎందుకంటే ఈ పత్రిక ఎంత ప్రజాదరణ పొందితే అంత ఎక్కువగా మన సంఘము పేరు పొందుతుంది.”
  • “మన ఉద్యమానికి వెన్నెముక వంటి బ్యాక్ టు గాడ్‌హెడ్ (భగవద్దర్శన్) పత్రికను తీర్చిదిద్దడానికే ప్రయత్నించండి, అదే మీ ప్రధానమైన బాధ్యత.”